దిగ్విజయ్‌ సింగ్‌కు భారీ షాక్‌!

1 Aug, 2017 13:53 IST|Sakshi
కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌ తొలగింపు

- తెలంగాణ పర్యవేక్షకుడిగా కుంతియాకు బాధ్యతలు

న్యూఢిల్లీ:
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కాంగ్రెస్‌ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు.

ఆయన స్థానంలో మరో సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అయిన రామచంద్ర కుంతియా(ఆర్‌.సి. కుంతియా)ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) ఒక ప్రకటనను విడుదల చేసింది. కుంతియాకు సెక్రటరీగా మరోనాయకుడు సతీశ్‌ నియమితులయ్యారు.

తన పదవీ కాలంలో దిగ్విజయ్‌ సింగ్‌.. పని తీరుతో కంటే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఐసిస్‌ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్‌ రాకెట్‌ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయను ఉన్న పళంగా తప్పించడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియాల్సిఉంది. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు