డిష్ టీవీ నష్టం రూ. 30 కోట్లు

27 Jul, 2013 08:01 IST|Sakshi
డిష్ టీవీ నష్టం రూ. 30 కోట్లు
న్యూఢిల్లీ: జీ గ్రూప్ కంపెనీ డిష్ టీవీ ఈ ఏడాది తొలి క్వార్టర్‌కు రూ. 30.37 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన గతేడాది ఏప్రిల్-జూన్‌లో సైతం రూ. 32.32 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే నష్టాలు స్వల్పంగా తగ్గాయి. ఇక ఈ కాలంలో ఆదాయం మాత్రం రూ. 520 కోట్ల నుంచి రూ. 576.5 కోట్లకు పెరిగింది. వివిధ చానళ్లతో కూడిన ప్యాకేజీల ధరలను పెంచడంతో సగటు వినియోగదారుడిపై లభించే ఆదాయం(ఏఆర్‌పీయూ) 5% బలపడి రూ. 165కు చేరిందని కంపెనీ ఎండీ జవహర్ గోయల్ పేర్కొన్నారు. కాగా, బీఎస్‌ఈలో షేరు ధర 8.2% పతనమై రూ. 52.35 వద్ద ముగిసింది.
 
మరిన్ని వార్తలు