సీఎం ఇంట్లో సీబీఐ దాడులా!

30 Sep, 2015 22:40 IST|Sakshi
సీఎం ఇంట్లో సీబీఐ దాడులా!

'నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. అత్యున్నత పదవిలో ఉన్న నాపై కేసు నమోదు చేయాలంటే ముందు ప్రాసిక్యూషన్, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఇది నేను చెబుతున్న విషయం కాదు. రాజ్యాంగమే పేర్కొంది. అలాంటిది.. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ నా ఇల్లు, ఆఫీసులోకి చొరబడి దాడులు చేస్తుందా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ లోని ఆరో సెక్షన్ ప్రకారం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధం. ఎఫ్ఐఆర్ లో నా పేరు, నా భార్య పేరు చేర్చడం దారుణం. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. అందుకే ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలని కోరుతున్నాను'.. అంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ షిమ్లా  హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.

వీరభద్రసింగ్, అతని సతీమణుల అక్రమ ఆస్తుల వ్యవహారంపై ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు జరుపుతున్నది. ఈలోపే సీబీఐ కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి ఆ ఇరువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరభద్ర సింగ్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. జస్టిస్ రాజివ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ సింగ్ ఠాకూర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.

మరిన్ని వార్తలు