500 లిస్టెడ్ కంపెనీలకు షాకిచ్చిన సెబి

14 Jul, 2016 13:03 IST|Sakshi
500 లిస్టెడ్ కంపెనీలకు షాకిచ్చిన సెబి

ముంబై:  మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బ్యూరో  సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది.  వాటాదారులకు డివిడెండ్ చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తూ  ఆదేశాలు జారీ చేసింది. దాదాపు  టాప్ 500 లిస్టెడ్ కంపెనీలకు డివిడెండ్ పంపిణీ విధానాన్ని తప్పనిసరి చేసింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు, ప్రతిఫలాలపై  స్పష్టమైన అవగాహన  పొందడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. భారీ లాభాలు ఉన్నప్పటికీ కంపెనీ వాటాదారుల మధ్య అదనపు లాభాలుపం పిణీ కావాడంలేదంటూ  వివిధ ఇన్వెస్టర్ గ్రూపుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ నిబంధనలు  రూపొందించింది.

ఇటీవల దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన సెబీ బోర్డు  ఈ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. అయితే డివిడెంట్ చెల్లించాల్సిందేనని  కంపెనీలకు బలవంత పెట్టదు కానీ, ఈ కొత్త పాలసీ ప్రకారం ఇన్వెస్టర్లకు ఆయా కంపెనీలు సమగ్ర సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.  సంస్థకు  చెందిన అదనపు లాభాలు,  వాటాల వినియోగం,  వివిధ తరగతులకు సంబంధించిన పారామీటర్ల వివరాలను వాటాదారులకు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 500 కంపెనీల  ప్రతి ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డివిడెండ్ పాలసీని రూపొందించాలని స్పష్టం చేసింది. ఇదే మిగతా కంపెనీలకు కూడా వర్తించనుందని  వెల్లడించింది. అలాగే  కంపెనీల  వార్షిక నివేదికలు వారి  వెబ్ సైట్లలో స్వచ్ఛందంగా వెల్లడి చేయాలని సెబీ పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థలు  చెల్లిస్తున్న డివిడెండ్ రేటు ఏదైనా ఉంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాలుగా చెలిస్తున్నవారి డివిడెండ్ విధానాన్ని  కూడా బహిర్గతం చేయాలి.
 

మరోవైపు సెబీ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు పాజిటివ్ గా స్పందించారు. ఇది మదుపర్లకు బాగా ఉపయోగపడుతుందని ఎనలిస్టుల అంచనా. తమ పెట్టుబడులకు సరియైన కంపెనీని ఎంచుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు  కలుగుతుందన్నారు.
 

మరిన్ని వార్తలు