ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!

12 Nov, 2016 14:29 IST|Sakshi
ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ సామాన్యులపై కాదని.. స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. నల్లధనం పెద్ద మొత్తంలో స్విస్ బ్యాంకులో దాగిఉన్న సంగతి విదితమే.  నల్లధనం వెలికితీతకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదని, కానీ అమలుచేసే పద్ధతే సరియైనది కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుచేస్తూ ప్రధాని వెల్లడించిన నిర్ణయంతో సామాన్య ప్రజలు అవస్తలు పాలవుతున్నారని విమర్శించారు. ప్రజలు మనకి ఓటేసిన సంగతి మరచిపోకూడదు. ఇది ఇలానే కొనసాగిస్తే.. ప్రజలు మనపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని హెచ్చరించారు. దబార్లో శివసేన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాలు తెలిపారు.
 
'' తరుచూ ప్రజలతో మన్ కీ బాత్ నిర్వహించే మోదీజీ.. ప్రజల మాటను మరచిపోయినట్టు కనిపిస్తున్నారు. ధన్ కీ బాత్ ఎంపికచేసుకున్నారు'' అని వ్యాఖ్యానించారు.. వేల కొద్దీ స్విస్ బ్యాంకులో దాగిఉన్న బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మోదీని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లపై బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే మోదీ చర్యలకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపండి, కానీ సామాన్య ప్రజలపై కాదని సలహా ఇచ్చారు. ప్రజలకోసం మంచి చేస్తున్నట్టు చూపిస్తూనే, మరోవైపు ప్రజల సొంత డబ్బుతోనే వారిని చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదని, పెళ్లిళ్లూ ఆగిపోయాయని చెప్పారు. బ్యాంకు క్యూలో నిల్చుని ఓ సీనియర్ సిటిజన్ మరణించడంతో, ఆయన మృతికి ఎవరు బాధ్యులని ఠాక్రే ప్రశ్నించారు.   
  
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా