ప్రసవిస్తున్న మహిళ పక్కనే సెల్ఫీ!

23 Jul, 2015 18:06 IST|Sakshi
ప్రసవిస్తున్న మహిళ పక్కనే సెల్ఫీ!

వైద్యవృత్తి అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు. రోగులు వైద్యులను దేవుళ్లుగా చూస్తారు. అలాంటి వైద్యులే దేవుళ్లకు బదులు దెయ్యాల్లా మారితే? అమెరికాలో ఓ వైద్యుడు ఇలాగే నీచంగా ప్రవర్తించాడు. ప్రసవిస్తున్న మహిళ పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకోవడమే కాక, దాన్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వెనిజువెలాకు చెందిన డేనియల్ శాంచెజ్  'నేను నీకు పురుడు పోస్తా గానీ.. ముందో సెల్ఫీ తీసుకోనివ్వు' అనే కేప్షన్తో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి.

రోజెస్ రివల్యూషన్ అనే సంస్థ దీనిపై ఉద్యమం మొదలుపెట్టింది. శాంచెజ్పై దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ల ఉద్యమం లేవదీసింది. ఓ మహిళ బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆమెను ఎంతో పవిత్రంగా చూడాలని, దానికి బదులు వైద్య నిపుణులు, వైద్య విద్యార్థులు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మహిళలను, పిల్లలను వారి అనుమతి లేకుండా, వారికి తెలియకుండా ఇలా ఫొటోలు తీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు