సోమ్‌నాథ్‌పై గృహహింస ఫిర్యాదు

11 Jun, 2015 01:51 IST|Sakshi
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ తో లిపిక

ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన భార్య
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో న్యాయ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ అరెస్టు, రాజీనామా ఉదంతం జరిగి 24గంటలైనా కాకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక గృహహింస చట్టం కింద ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)లో  బుధవారం ఫిర్యాదు చేశారు.  భర్త తనను శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ ఆరోపణలకు జూన్ 26లోగా తమ ముందు హాజరై సమాధానం చెప్పాలని డీసీడబ్ల్యూ సోమ్‌నాథ్‌కు నోటీసు ఇచ్చింది. భర్త, ఆయన అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని లిపిక చెప్పారు.  2010 నుంచీ సోమ్‌నాథ్ ఆమెను వేధిస్తున్నారని.. ఇక ఈ వేధింపులకు ముగింపు పలకాలని లిపిక భావిస్తున్నారని డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ అన్నారు. మూడేళ్లుగా లిపిక సోమ్‌నాథ్‌కు దూరంగా విడిగా ఉంటున్నప్పటికీ, ఆయన ఆమె దగ్గరకు వచ్చిపోతున్నారని బర్ఖా చెప్పారు. 2010 నుంచి సోమ్‌నాథ్‌తో గడ్డుకాలాన్ని అనుభవించానని, వివాహ బంధం నుంచి విముక్తి కోరుకుంటున్నానని లిపిక చెప్పారు.

>
మరిన్ని వార్తలు