'మా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది'

23 Jul, 2014 15:41 IST|Sakshi
'మా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది'

ముంబై: తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ఇతర మతాల పట్ల తమ పార్టీకి ఎటువంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. శివసేన ఎంపీలు ఢిల్లీలో ముస్లింతో బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నించి అతడి ఉపాసన దీక్షను భగ్నం చేశారని వచ్చిన ఆరోపణలపై థాకరే స్సందించారు.

'ఇది శివసేన గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నం. హిందుత్వ వాదులుగా ఉనప్పటికీ ఇతర మతాల పట్ల మాకు ద్వేషభావం లేదు' అని ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో శివసేన ఎంపీలు బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో నిరసన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు