'తలుపులు తెరిచే ఉన్నాయి'

26 May, 2015 13:15 IST|Sakshi
'తలుపులు తెరిచే ఉన్నాయి'

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీతో చేతులు కలిపే అవకాశముందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించారు. కొత్త భాగస్వాములను కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తమతో చేతులు కలిపేందుకు ఇతర పార్టీలకు తలుపులు తెరిచే ఉన్నాయని, కొత్త భాగస్వాములను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తమకు కీలకమని చెప్పారు. ఇప్పుడున్న కూటమితోనే బీహార్ ఎన్నికలకు వెళతారా, కొత్తవాళ్లను చేర్చుకుంటారా అన్న ప్రశ్నకు ఆయనీ విధంగా స్పందించారు. ఆర్జీడీ నుంచి బహిష్కృతుడైన ఎంపీ పప్పు యాదవ్ కూడా బీజేపీతో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు