'పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకపోవచ్చు'

5 Feb, 2014 11:53 IST|Sakshi
'పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకపోవచ్చు'

న్యూఢిల్లీ : కీలకమైన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ సర్కారు సిద్దమైన వేళ.. బిల్లుల ఆమోదంపై కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందడం కష్టమేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు.

ఢిల్లీలోని ఓ బిజినెస్ కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో  పాల్గొన్న చిదంబరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆయన బిల్లుల ఆమోదం జరిగేలా లేదని  అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు