డాక్టర్ రెడ్డీస్.. మళ్లీ తుస్!

4 Feb, 2017 15:24 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్.. మళ్లీ తుస్!
న్యూఢిల్లీ :
దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరోసారి పడిపోయింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లోనూ కంపెనీ కన్సాలిడేట్ నికరలాభాలు 17 శాతం మేర క్షీణించాయి. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.483.40 కోట్లగా నమోదయ్యాయి. 2015 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ డ్రగ్ మేకర్ లాభాలు రూ.579.30 కోట్లగా ఉన్నాయి. ఇతర సమగ్ర ఆదాయలు రూ.119.40 కోట్లగా నమోదయ్యాయి. కంపెనీ నికర విక్రయాలు కూడా మందగించినట్టు కంపెనీ నేడు నమోదుచేసిన బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది.
 
ఈ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 7 శాతం డౌన్ అయి రూ.3,653.40 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. నిర్వహణ లాభాలు(ఈబీఐటీడీఏలు) కూడా ఏడాది ఏడాదికి 13.06 శాతం క్షీణించి, రూ.879.3 కోట్లగా రికార్డు అయ్యాయి. అయితే మూడో త్రైమాసికంలో కంపెనీకి గ్రాస్ ప్రాపిట్ మార్జిన్లు మంచిగా 59.10 శాతం పెరిగాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఈ క్వార్టర్లో రూ.500 కోట్లను ఖర్చుచేసినట్టు పేర్కొంది. 
మరిన్ని వార్తలు