ఇక వాటర్ బాటిళ్లను కూడా తినొచ్చట!

30 Mar, 2014 22:43 IST|Sakshi

లండన్: ఇకపై తాగేసిన వాటర్ బాటిళ్లు చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులు రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు.   తినడానికి అనువుగా ఉన్న ‘ఓహో’ బాటిల్‌ను ఉపయోగిస్తే చాలు.తాగాల్సింది తాగేసి, బాటిల్‌ను కూడా లొట్టలేసుకుంటూ తినొచ్చు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోళాకారంలో కనిపించే దీన్ని ఉప్పు, గోధుమవర్ణం శిలీంధ్రానికి చెందిన జిగురుతో తయారు చేశారు. రెండు పొరలతో నిర్మితమైన ఈ బాటిల్‌కు ‘ఓహో’అని పేరు పెట్టారు.

 

ఇందులో ద్రవాలను నిల్వచేయవచ్చు. తాగిన తర్వాత కూల్‌గా బాటిల్‌ను కూడా తినొచ్చు. ‘ఓహో’ పర్యావరణహితమైందే కాకుండా ఎంతో సురక్షితమైంది, చవకైందని తయారీదారులు చెబుతన్నారు.
 

>
మరిన్ని వార్తలు