సునంద మృతికి కారణమిదేనా?

18 Jan, 2014 21:35 IST|Sakshi
సునంద మృతికి కారణమిదేనా?

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతికి గల కారణాలను అన్వేషించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునంద ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వెలువడగా, ఆమె మరణం ఆకస్మిక, అసజమైనదిగా వైద్యులు నిర్దారించడంతో పలు సందేహాలు తలెత్తాయి. కాగా అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్లే ఆమె మరణించి ఉంటారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి స్థాయి వైద్య నివేదిక రెండు రోజుల్లో వెల్లడి కానుంది. సునంద మృతిపై శశిథరూర్ను సోమవారం పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారమే ఆయన్ను ప్రశ్నించాలని పోలీసులు భావించినప్పటికీ ఆయన కుటుంబం హరిద్వార్కు వెళ్లనుండటంతో వాయిదా వేసుకున్నారు. సునంద సోదరుడు, కుమారుడు, ఇద్దరు పనిమనుషుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

సునంద మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం అనంతరం లోథీ రోడ్డులోని శశిథరూర్ నివాసానికి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, ఈ కేసులో పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టుతో శశిథరూర్కు సంబంధాలున్నాయని సునంద ఆరోపించడం సంచలనం రేకెత్తించింది.

మరిన్ని వార్తలు