హీరోయిన్‌ ఛార్మీకి అండగా నిలిచిన తండ్రి

19 Jul, 2017 16:13 IST|Sakshi
ఛార్మీ తీవ్రంగా కలత చెందింది: దీప్‌సింగ్‌

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మిపై వస్తున్న ఆరోపణలను ఆమె తండ్రి దీప్‌ సింగ్‌ ఉప్పల్‌ ఖండించారు. ‘13 ఏళ్ల నుంచే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోంది. చిన్ననాటి నుంచే  కుటుంబానికి అండగా ఉంటోంది. తనపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలతో నా కుమార్తె తీవ్రంగా కలత చెందింది. ఒకవేళ చార్మీకి డ్రగ్స్‌ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా?. తనకు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయం లేదు.

ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్‌తో బిజీగా ఉంది. అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నాకు పూరీ జగన్నాథ్‌ వ్యక్తిగతంగా తెలుసు. పూరీ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు.త్వరలోనే క్లీన్‌చిట్‌ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుంది.’ అని ఛార్మి తండ్రి వ్యాఖ్యానించారు. కాగా డ్రగ్స్‌ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న ఛార్మీ సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు