మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

26 Sep, 2015 18:58 IST|Sakshi

సూరత్: గుజరాత్ రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ తప్పతాగి వీరంగం సృష్టించాడు. సూరత్లో తర్వాడి పోలీస్ చౌకీ వద్ద మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తన సర్వీసు గన్తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. సూరత్ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

రాఘవేంద్ర సిన్హ్ (32) అనే కానిస్టేబుల్ ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసు అధికారులు చెప్పారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. రాఘవేంద్ర సిన్హ్ తన సహాయకుడితో గొడవపడి గాల్లోకి కాల్పులు జరిపినట్టు చెప్పారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అతన్ని బంధించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు