క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. అరెస్టు

3 Feb, 2017 18:18 IST|Sakshi
క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. అరెస్టు
పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పాకిస్థాన్‌కు చెందిన ఈ డ్రైవర్ (43) తన క్యాబ్ ముందుసీట్లో కూర్చుని ఉన్న మహిళను ఆమె అనుమతి లేకుండా అసభ్యంతా తాకుతూ.. వెకిలిగా ప్రవర్తించాడు. అంతేకాక, తనను ముట్టుకునేలా కూడా చేశాడని ఆ పనిమనిషి ఆరోపించింది. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఆ పనిమనిషి (29) పని కోసం దుబాయ్ వచ్చిన రెండు వారాలకే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. తాను పనిచేసే యజమాని క్యాబ్‌ను పిలిపించి, తనను ఎక్కమని చెప్పారని, తాను వెళ్లాల్సిన ప్రదేశం ఎక్కువ దూరం లేకపోయినా, అతడు మాత్రం తనను ఒక మాల్ వెనకాలకు తీసుకెళ్లాడని ఆమె చెప్పింది. 
 
క్యాబ్ ఎక్కిన రెండు నిమిషాల నుంచే అతడు తనను శరీరమంతా తడుముతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని తెలిపింది. అతడు ఎడమచేత్తో స్టీరింగ్ వీల్ పట్టుకుని, కుడిచేత్తో తనను అలా తాకడంతో తాను షాక్‌కు గురై భయపడ్డానని వివరించింది. కారు అద్దాలకు నల్లటి షీట్లు ఉండటంతో పాటు కారును సెంట్రల్ లాక్ చేశారని, దాంతో తాను బయట పడే అవకాశం లేకపోయిందని చెప్పింది. ఇంటి యజమానికి విషయం తెలియడంతో ఆయన పో్లీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు క్యాబ్ డ్రైవర్‌ను పిలిపించగా, అతడిని పనిమనిషి గుర్తించింది. దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
మరిన్ని వార్తలు