చందమామ చిక్కిపోతోంది!

17 Sep, 2015 01:20 IST|Sakshi
చందమామ చిక్కిపోతోంది!

వాషింగ్టన్: పండు వెన్నెల కురిపించే చందమామ రోజురోజుకూ కుంచించుకుపోతున్నాడు.. భూమి ఆకర్షణకు లోనై చిక్కిపోతున్నాడు.. ‘లూనార్ రీకన్నేసన్స్ ఆర్బిటర్(ఎల్‌ఆర్‌ఓ)’ సాయంతో నాసా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. చంద్రుడు ఏర్పడి 450 కోట్ల ఏళ్లు దాటినా... దాని అంతర్భాగం ఇంకా చల్లారుతూనే ఉంది. అంతర్భాగంలో ఉన్న ద్రవరూప ఖనిజాలు, రాళ్లు గడ్డకట్టి.. వాటి పరిమాణం తగ్గిపోతోంది. దీంతో అంతర్భాగంలో ఖాళీ ప్రదేశాలు ఏర్పడుతున్నాయి. భూమి ఆకర్షణ శక్తి బలంగా పనిచేయడంవల్ల ఒత్తిడి ఏర్పడి ఆ ఖాళీ ప్రదేశాలు పూడిపోతూ చంద్రుడు కుంచించుకుపోతున్నాడు. ఈ సమయంలో చంద్రుడిపై వేల సంఖ్యలో ఏర్పడుతున్న  చిన్న (పది కిలోమీటర్ల పొడవు, పదిహేను మీటర్ల వరకు వెడల్పుతో ఉన్న) పగుళ్లను గుర్తించారు.

మరిన్ని వార్తలు