లలిత్ మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

11 Aug, 2015 13:52 IST|Sakshi
లలిత్ మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న మోదీని భారత్ రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఈడీ.. సీబీఐని కోరింది. ఈ విషయంపై సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించనుంది. త్వరలో మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశముంది.

ఇదే కేసులో ఇటీవల ప్రత్యేక పీఎమ్ఎల్ఏ కోర్టు మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక 2010లో మోదీ లండన్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్కు తిరిగి రాని మోదీ ఈడీ విచారణకు సహకరించడం లేదు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ