అక్రమాస్తుల కేసు: సీఎంకు మళ్లీ సమన్లు

13 Apr, 2017 16:07 IST|Sakshi
అక్రమాస్తుల కేసు: సీఎంకు మళ్లీ సమన్లు

షిమ్లా: మనీలాండరింగ్ కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు చిక్కులు తప్పేలాలేవు. గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇంతకుముందు ఈడీ సమన్లు పంపగా.. వీరభద్ర సింగ్ వెళ్లలేదు. దీంతో ఈడీ తాజాగా మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వీరభద్ర సింగ్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. ఈ ఫాంహౌస్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ. 27 కోట్లు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసింది. 2015 సెప్టెంబర్‌లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు