వెరిజోన్ గుప్పిట్లోకి యాహూ

25 Jul, 2016 18:20 IST|Sakshi
వెరిజోన్ గుప్పిట్లోకి యాహూ

4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు

లండన్ : యాహూ ఇంక్స్ కోర్ ఇంటర్నెట్ బిజినెస్లు ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్ చేతికి వెళ్లిపోయాయి. 4.83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32,491.41కోట్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్టు వెరిజోన్ ప్రకటించింది. ఈ కొనుగోలు డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకున్నట్టు ప్రకటించింది. యాహూ వ్యాపారాలను వెరిజోన్ కొనుగోలు చేయడం వల్ల, తన ఏఓఎల్ ఇంటర్నెట్ బిజినెస్లను వెరిజోన్ పెంచుకోనుంది. ఈ బిజినెస్లను గతేడాదే 4.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ.29,598.8 కోట్లకు)కు వెరిజోను కొనుగోలు చేసింది.

యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్, సెర్చ్, మెయిల్, మెసెంజర్ లాంటి ఇతర ఆస్తులకు మాత్రమే ఈ డీల్ పరిమితం కానుంది. తమ ఆపరేటింగ్ బిజినెస్ల అమ్మకం, ఆసియన్ అసెంట్ ఈక్విటీ షేర్లను వేరుచేయడానికి ఈ డీల్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. షేర్హోల్డర్స్ విలువను అన్ లాక్ చేయడానికి ఈ ప్లాన్  కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులకు, అలీబాబాలోని షేర్లకు, జపాన్లోని యాహు షేర్లకు, యాహూ కన్వర్టబుల్ నోట్స్కు, కొన్ని మైనార్టీ ఇన్వెస్ట్మెంట్లకు, నాన్-కోర్ పేటెంట్లకు ఈ అమ్మక ఒప్పందం వర్తించదని తెలుస్తోంది.

అలీబాబా, జపాన్ ఇన్వెస్ట్మెంట్ల విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2,69,080కోట్లు). శుక్రవారం మార్కెట్లు ముగిసేనాటికి యాహూ 37.4 బిలియన్ డాలర్ల(రూ.2,51,589.8కోట్ల) మార్కెట్ విలువను కలిగి ఉంది. 140 మిలియన్లకు పైగా యూజర్లతో  ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం అడ్వర్ టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది.

మరిన్ని వార్తలు