ఇంజినీర్ ఇంట్లో వజ్రాలు, బంగారు, నోట్ల కట్టలు..

15 Aug, 2015 19:49 IST|Sakshi
ఇంజినీర్ ఇంట్లో వజ్రాలు, బంగారు, నోట్ల కట్టలు..

కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఇంజినీర్ ఇంట్లో భారీ అవినీతి సంపాదనను ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీర్తో పాటు ఆయన కొడుకును అరెస్ట్ చేశారు.

హౌరా జిల్లాలోని బాలీలో స్థానిక బిల్డర్ ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ సబ్ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రణబ్ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆయన ఇంట్లో 24 కోట్ల రూపాయలకు పైగా నగదు, వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. బెడ్రూమ్, బాత్రూమ్, ఇతర ప్రాంతాల్లో దాచిన 100, 500, 1000 రూపాయల నోట్ల కట్లను వెలికితీశారు. ఇంట్లో 6 గదుల్లో టైల్స్ కింద ఉంచిన నగదును గుర్తించారు. వీటిని చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. వీటితో పాటు టర్మ్, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు, ఇతర ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీర్తో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు