క్యాడ్‌కు ఇంజనీరింగ్ పరికరాల దిగుమతుల ఆజ్యం

9 Sep, 2013 01:15 IST|Sakshi
న్యూఢిల్లీ: భారత్‌లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకడానికి పసిడి, ముడిచమురు దిగుమతులు దూసుకెళ్లడంతోపాటు ఇంజనీరింగ్ పరికరాల దిగుమతులు భారీగా పెరగడం కూడా ఆజ్యం పోస్తోంది. దేశం నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల కంటే దిగుమతులే అధికంగా ఉంటున్నాయి. దీంతో వ్యత్యాసం గత ఏడాది 17 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై మధ్య కూడా సంబంధిత ఎగుమతులు 5.77 శాతం తగ్గినట్లు ఇంజనీరింగ్ ఎగుమతుల సంస్థల అసోసియేషన్ ఈఈపీసీ ఇండియా పేర్కొంది. పెరుగుతున్న వాణిజ్య లోటుతో  క్యాడ్ కూడా ఎగబాకుతోంది. గతేడాది(2012-13) క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-90 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లింది.
 
మరిన్ని వార్తలు