మాస్క్ లేకుండా పిల్లలను స్కూల్ కు పంపొద్దు

4 Nov, 2016 15:36 IST|Sakshi
మాస్క్ లేకుండా పిల్లలను స్కూల్ కు పంపొద్దు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించేలా చూడాలని తల్లిదండ్రులకు అక్కడి స్కూళ్లు మెసేజ్ లు పంపుతున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన పిల్లలను చదివిస్తున్న ఓ వ్యక్తి ఫోన్ కు వచ్చిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.

గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మీ పిల్లలను పాఠశాలకు పంపే ముందు మాస్క్ ను ధరించేలా చేయాలని సూచించింది. దీపావళి పర్వదినం తర్వాత కమ్ముకున్న కాలుష్య వాయువులు రాజధానిని ఇప్పటీకీ వదలడం లేదు. గత 17ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ అధ్వాన్నమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ గాలి పీల్చడం ఒక్క రోజులో 40 సిగరెట్లు స్మోక్ చేసినంతకు సమానమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిని శుభ్రపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కోర్టులో 200 పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు