శత్రువులెవరో.. చిన్నారులకూ తెలుసు!!

9 Jan, 2014 16:46 IST|Sakshi

మాటలు రాకపోయినా.. తమకు మిత్రులెవరో, శత్రువులెవరో చిన్నారులు కూడా సులభంగా గుర్తు పట్టేస్తారట. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో శిశువుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. చివరకు 9 నెలల పిల్లలు కూడా తమతో ఎవరెలా వ్యవహరిస్తున్నారో ఇట్టే గుర్తుపట్టేస్తారని, ఇతరుల సామాజిక సంబంధాలను వాళ్లు చాలా పక్కాగా గమనిస్తుంటారని పరిశోధనలో పాలుపంచుకున్న సైకాలజీ ప్రొఫెసర్ అమందా ఎల్. వుడ్వర్డ్ తెలిపారు.

9 నెలల వయసున్న మొత్తం 64 మంది పిల్లలను బృందాలుగా చేసి, వారికి ఇద్దరు పెద్దవాళ్ల వీడియోలు చూపించారు. వాళ్లు రెండు వేర్వేరు రకాల ఆహారాలు తిన్నారు. అలా తినేటప్పుడు కూడా అయితే పాజిటివ్గా, లేకపోతే నెగిటివ్గా వారు స్పందించారు. ఈ వీడియోలను పిల్లలకు చూపించారు. అప్పుడు వాళ్లు ఈ ఇద్దరి విషయంలో వేర్వేరుగా తమ భావాలు పలికించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తినేటప్పుడు శిశువులు వాళ్ల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తారని, దాన్ని బట్టే సామాజిక సంబంధాలు నిర్వహిస్తారని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కేథరిన్ డి.కింజ్లర్ తెలిపారు.

మరిన్ని వార్తలు