టీడీపీకి రమేశ్‌ రాంరాం

28 May, 2017 13:08 IST|Sakshi
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో రమేశ్‌ రాథోడ్‌(ఫైల్‌ ఫొటో)

- మహానాడు జరుగుతుండగానే పొలిట్‌బ్యూరో సభ్యుడి సంచలన నిర్ణయం
- సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికు సిద్ధం.. కేడర్‌ కూడా


హైదరాబాద్‌:
ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్‌. ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ టీడీపీకి రాజీనామాచేశారు. సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ చేరికతో ఆదిలాబాద్‌జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ సందర్భంగా రమేశ్‌ రాథోడ్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలు నచ్చడంతోపాటు కేసీఆర్‌ ఆహ్వానించడం వల్లే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రమేశ్‌ రాథోడ్‌ చెప్పారు. తనతోపాటు టీడీపీ క్యాడర్‌ మొత్తం టీడీపీ నుంచి బయటికి వచ్చేసిందని తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నచ్చే పార్టీ మారానని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మధ్యవర్తిత్వం వహించి టీఆర్‌ఎ్‌సలో చేరేలా రమేశ్‌ రాథోడ్‌ను ఒప్పించారనే వార్తలపై స్పందిస్తూ ‘నాగేశ్వర్‌రావు నాకు ఆప్తమిత్రుడు’అని వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే ఉట్నూర్‌ లేదా ఖానాపూర్‌ నుంచి రమేశ్‌ రాథోడ్‌ పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ప్రస్తుత ఎంపీ జి.నగేశ్‌ ఒకవేళ బోథ్‌ నియోకవర్గం నుంచి బరిలో దిగితే ఆదిలాబాద్‌ ఎంపీ స్థానంలో రమేశ్‌ రాథోడ్‌ పోటీ చేయవచ్చునని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చజరుగుతున్న నేపథ్యంలో తాను ఏదో ఆశించి పార్టీ మారడంలేదని రాథోడ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు