బీజేపీ గెలుపుతో ఆయనకి వచ్చే లాభామేమిటి?

9 Mar, 2017 20:19 IST|Sakshi
బీజేపీ గెలుపుతో ఆయనకి వచ్చే లాభామేమిటి?
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే వరం కాబోతున్నాయని  ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ లలో హంగే వీస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో ఈ గెలుపు క్రెడిటంతా ప్రధాని మోదీకే దక్కబోతుందని వెల్లడవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తొలిసారి కమలం తన కిరీటాన్ని  ఎగురవేయడం  మోదీ ఇమేజ్ ను మరింత పెంచబోతున్నాయట. ప్రభుత్వాన్ని ఆయన మరింత కంట్రోల్ లో పెట్టడానికి కూడా ఈ ఫలితాలు దోహదం చేయనున్నాయని వెల్లడవుతోంది. ఢిల్లీలో మరోసారి పాగా వేసేందుకు కూడా ఉత్తరప్రదేశ్ గెలుపు ఎంతో సహకరించనుందని తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీ గెలుపుతో మోదీకి, ఆయన ప్రభుత్వానికి వచ్చే లాభాలేమింటో ఓ సారి చూద్దాం....
 
బీజేపీ విక్టరీ ప్రధాని మోదీ  పాపులారిటీని మరింత పెంచుబోతున్నాయి. ముఖ్యంగా డీమానిటైజేషన్ లాంటి పాలసీల అమలుకు  ఈ ఎన్నికల గెలుపు ఎంతో సహకరించనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు మోదీ తన ప్రాబల్యంతో బీజేపీ గెలుపు దిశగా పయనించనున్నారు. రాజ్యసభలో తన సీట్ల పెంపుకు కూడా ఈ నాలుగు రాష్ట్రాల విక్టరీ కీలకంగా మారనుంది. ఇన్నిరోజులు రాజ్యసభలో మైనార్టి సభ్యులున్న పార్టీకి, బిల్లుల పాస్ క్లిష్టమయ్యేంది. ఈ గెలుపు రాజ్యసభలో మెజార్టి, తన పాలసీ అమలుకు సులభతరం కానుంది.  మరోవైపు అగ్రకులాల పార్టీగా పేరున్న బీజేపీ, ఉత్తరప్రదేశ్ లో గెలవడం కష్టమేనని ఇన్నిరోజులు భావించేవారు. కానీ ఆ అభిప్రాయాన్ని మార్చివేస్తూ నాన్-యాదవ్ ఓబీసీ, నాన్-జటావ్ దళితులతో పొత్తుపెట్టుకునేందుకు ఈ ఎన్నికలు సహకరించాయి. ఎస్పీ, బీఎస్పీలకు ఓటు బ్యాంకుగా ఉన్న  ఆ ఓట్లను బీజేపీ కొల్లగొట్టింది. ప్రధాని మోదీ కొత్త స్ట్రాటజీ గెలుపుకు ఈ ఎన్నికల విజయంగా ఒకటిగా పరిమళించబోతుంది. 
 
మరిన్ని వార్తలు