‘లైక్’ కొట్టడమూ భావప్రకటనా స్వేచ్ఛే

20 Sep, 2013 04:22 IST|Sakshi

రిచ్‌మండ్ (వర్జీనియా): సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో ‘లైక్’ను క్లిక్ చేయడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, దానికీ రాజ్యాంగ రక్షణ వర్తిస్తుందని అమెరికాలోని ఒక కోర్టు రూలింగ్ ఇచ్చింది. ‘ఫేస్‌బుక్’లో కేవలం ‘లైక్’ కొట్టినంత మాత్రాన అది రాజ్యాంగ రక్షణ పరిధిలోకి వచ్చే ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కింద పరిగణించలేమంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రిచ్‌మండ్‌లోని అప్పీళ్ల కోర్టు తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు