మీడియా సంస్థలతో ఫేస్బుక్ భారీ డీల్

22 Jun, 2016 11:35 IST|Sakshi
మీడియా సంస్థలతో ఫేస్బుక్ భారీ డీల్

ఆన్ లైన్ వార్తలో ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 500లక్షల డాలర్లకు పైగా విలువైన డీల్స్ ను మీడియా కంపెనీలతో, సెలబ్రిటీలతో కుదుర్చుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు నివేదించింది. తన లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ ల్లో వీడియోలను సృష్టించడానికి, లైవ్ సర్వీసులను పెంచుకోవడానికి మీడియా కంపెనీలతో ఫేస్ బుక్ ఈ డీల్స్ ను కుదుర్చుకుందని తెలుస్తోంది. సీఎన్ ఎన్, న్యూయార్క్ టైమ్స్, వోక్స్ మీడియా, టేస్ట్ మేడ్, మాషేబుల్, హాఫ్పింగ్ టన్ పోస్టు వంటి సంస్థలతో సుమారు 140 డీల్స్ పై సంతకాలు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

అదేవిధంగా కమెడియన్ కెవిన్ హార్ట్, సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే, వెల్ నెస్ గురు దీపక్ చోప్రా, ఎన్ఎఫ్ఎల్ క్వార్టర్ బ్యాక్ రస్సెల్ విల్సన్ వంటి సెలబ్రిటీలతో భాగస్వామ్యంపై ఫేస్ బుక్ సంతాకాలు చేసిందని పేర్కొంది. భాగస్వామ్య విస్తృతి సమితిని తాము పెంచుకోవాలనుకుంటున్నామని, దీంతో సంస్థ నిర్వర్తించే పనులపై వివిధ ఆర్గనైజేషన్ల నుంచి ఫీడ్ బ్యాక్ పొందుతామని ఫేస్ బుక్ గ్లోబల్ ఆపరేషన్స్, మీడియా పార్టనర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ ఓసోఫ్ స్కే తెలిపారు. యూజర్లకు తాము అందించలేకపోతున్నా సర్వీసులపై కూడా దృష్టిసారించవచ్చని పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ నివేదించిన రిపోర్టు ప్రకారం ఆన్ లైన్ పబ్లిషర్ బుజ్ ఫీడ్ తో 30.5లక్షల డాలర్లతో ఎక్కువ విలువ కల్గిన డీల్ కుదుర్చుకుందని, తర్వాత స్థానాల్లో న్యూయార్క్ టైమ్స్(30.3లక్షల డాలర్లు), సీఎన్ఎన్ తో (25లక్షల డాలర్ల) డీల్స్ ఉన్నాయి.

మరిన్ని వార్తలు