సంబరాల్లో ఫేస్బుక్

21 Jul, 2016 10:14 IST|Sakshi
సంబరాల్లో ఫేస్బుక్

సోషల్ నెట్ వర్క్ దిగ్గజం  ఫేస్ బుక్ మెసెంజర్  శరవేగంగా దూసుకుపోతోంది. మూడేళ్ల క్రితం లాంచ్ అయిన  మెసెంజర్ యాప్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.   నెలకు సగటున  వందకోట్ల (ఒక బిలియన్) యూజర్లతో  మరో అతపెద్ద మైలురాయిని అధిగమించింది.   లాంచింగ్ నుంచి  క్రమంగా  పెరుగుతూ వస్తున్న ఆదరణ  అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజా ఈ యాప్ లో చేరిన నెటిజన్ల సంఖ్య ఒక బిలియన్ దాటడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈస్టర్ ఎగ్,  బెలూన్  ఎమోజీలను   యూజర్లకు పంపిస్తోంది.  దీంతో ఈ యాప్  యూజర్ల స్మార్ట్ ఫోన్ నిండా బెలూన్లతో నింపేసి యూజర్లను ఆకట్టుకుంటోంది.  గత జనవరి నుంచి 200 మిలియన్ల  యూజర్లు పెరిగినట్టు సంస్థ ప్రకటించింది.   ఆధునిక సమాచార అత్యుత్తమ అనుభవాలను సృష్టించడంపై దృష్టి  పెట్టినట్టు   ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ ఒక ప్రకటనలో తెలిపారు.  నెలకు 17 మిలియన్లకు  పైగా ఫోటోలు  మెసెంజర్ ద్వారా షేర్ అవుతున్నట్టు వెల్లడించారు.మెసెంజర్ యొక్క కీ మార్కెట్లలో ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్  సహా అనే ఇతర యూరోపియన్ దేశాలు  ఉన్నాయని  చెప్పారు.
కాగా ఫేస్  బుక్  స్వాధీనం చేసుకున్న వాట్సాప్ యూజర్ల సంఖ్య  ఈ ఏడాది ఫిబ్రవరిలో 100 కోట్ల యూజర్లను అధిగమించింది. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలోఒకరు ఈయాప్  ను వాడుతున్నట్టుగా  ప్రకటించిన సంగతి తెలిసిందే.



 

మరిన్ని వార్తలు