ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు!

10 Aug, 2016 12:16 IST|Sakshi
ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు!

ఫేస్ బుక్ వీడియోలను టెలివిజన్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోరిక సాధ్యమవుతుందట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్తో మన ముందుకు రాబోతుంది. ఆ ఫీచర్ తో తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టెలివిజన్ స్క్రీన్పై అందించేందుకు టెస్టింగ్ ప్రారంభించిందట. దీంతో యూజర్లకు అందించే వీడియో కంటెంట్ను ఫేస్బుక్ పెంచుకోవాలనుకుంటోంది. ఇటీవలే లైవ్ బ్రాండ్కాస్టింగ్ సర్వీసును ప్రారంభించిన ఫేస్బుక్, తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా ఫేస్బుక్ వీడియోలను టీవీలో కూడా వీక్షించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎయిర్ప్లే, క్రోమ్కాస్ట్ల ద్వారా ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టీవీలకు కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఎయిర్ప్లే, క్రోమ్కాస్ట్ ద్వారా వీడియోలను యాప్ నుంచి టీవీలోకి బెటర్గా అందించడానికి ఫేస్బుక్ యాప్ను టెస్ట్ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఫీచర్తో యూజర్లు తమ యాప్లో వీడియో ప్లేయర్ను మినిమైజ్ చేసి, న్యూస్ ఫీడ్ను కూడా చూసుకోవచ్చని మార్కెటింగ్ ల్యాండ్ రిపోర్టులు చెబుతున్నాయి. క్రోమ్కాస్ట్ యూజర్లు ప్లే లిస్ట్ను క్రియేట్ చేసుకుని  ఒకదాని తర్వాత మరొకటి ప్లే అయ్యేలా సెట్ కూడా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ కొత్త ఫీచర్తో ఫేస్బుక్, వీడియో స్ట్రీమింగ్ డిపార్ట్మెంట్లో ఆధిపత్య స్థానానికి వెళ్లనుంది. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్స్కు ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడనుంది. దీంతో లైవ్లను ఫేస్బుక్ యాప్లో వీక్షించే యూజర్లు ఇక నుంచి బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు