వాటిపై పోరాటానికి దిగిన సోషల్ మీడియాలు

14 Sep, 2016 10:11 IST|Sakshi
వాటిపై పోరాటానికి దిగిన సోషల్ మీడియాలు
తప్పుడు వార్తా కథనాలపై పోరాటానికి సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా సన్నద్ధమయ్యాయి. 30కి పైగా న్యూస్, టెక్నాలజీ కంపెనీలతో ఏర్పడిన నెట్వర్క్తో ఈ రెండు కంపెనీలు జతకట్టాయి. సోషల్ మీడియా సమాచారంలో క్వాలిటీని మెరుగుపరచడానికి నెట్వర్క్లో చేరినట్టు ట్విట్టర్, ఫేస్బుక్ మంగళవారం వెల్లడించాయి. ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ అండతో 2015 జూన్లో మొదటి డ్రాప్ట్ కూటమి ఏర్పడింది. దీనికోసం వాలంటరీ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ను ఏర్పరచున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా యూజర్లలో న్యూస్ లిటరసీని పెంచనున్నారు. ప్రశ్నించదగ్గ వార్తా కథనాలను సవరించుకునే వెసులుబాటుగా ఈ ప్లాట్ఫామ్ లాంచ్ కానుంది. అక్టోబర్ చివరిలో ఈ ప్లాట్ఫాట్ను ఆవిష్కరించనున్నట్టు కూటమి మేనేజింగ్ డైరెక్టర్ జెనీ సర్జెంట్ తెలిపారు. ఈ గ్రూపులో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, బజ్ఫీడ్ న్యూస్, ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెసీ, సీఎన్ఎన్లు మెంబర్లుగా ఉండనున్నాయి.    
 
నెలకు 1.7 బిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఫేస్బుక్ ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉంది. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ఫేస్బుక్ ఈ మధ్యన తెగ ఆరోపణలు ఎదుర్కొంటోంది. తప్పుడు కథనాలను, తప్పుడు సమాచారాన్ని అందించడానికి పనిచేస్తుందంటూ పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్రెండింగ్ స్టోరీలలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా రోజుకి 140 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ట్విట్టర్ బ్రేకింగ్ న్యూస్ అందించడంలో సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ కూడా తరచు హింసాత్మక ప్రచారం చేస్తుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తా కథనాలపై పోరాటానికి ఈ నెట్వర్క్లో ఫేస్బుక్, ట్విట్టర్ జాయిన్ అయ్యాయి.   
మరిన్ని వార్తలు