ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్లి.. బందీగా చిక్కి!

2 Jul, 2016 18:56 IST|Sakshi
ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్లి.. బందీగా చిక్కి!

ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్): ఢాకాలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తరుషి జైన్‌ (19) ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని తెలుస్తోంది.  బీఏ ఎకనామిక్స్‌ స్టూడెంట్‌ అయిన ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బెకర్లీ కాలేజీలో చదువుతున్నట్టు సమాచారం.

2016లో ఈస్ట్రర్న్‌ బ్యాంకు లిమిటెడ్‌ (ఈబీఎల్‌) ఇంటర్న్‌షిప్‌ పథకానికి ఎంపికైన ఆమె తన ప్రాజెక్టులో భాగంగా ‘బంగ్లాదేశ్‌లో ఈబీఎల్‌ కామర్స్‌ వృద్ధి అవకాశాలు’ అంశంపై అధ్యయనం నిర్వహిస్తున్నది. ఆమె తండ్రి సంజీవ్ జైన్‌ ఓ వస్త్రాల వ్యాపారి.. ఆయన ఢాకాలో నివాసముంటున్నారని తెలిసింది. శుక్రవారం స్నేహితులతో కలిసి తరుషి రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిందని, ఆ రెస్టారెంట్‌లో ఉగ్రవాదులు ప్రవేశించడంతో ఆమె బందీగా చిక్కిందని ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఉంటున్న ఆమె బంధవులు తెలిపారు.

తరుషి మృతి గురించి మధ్యాహ్నం 3 గంటలకు తమకు సమాచారం అందిందని, ఆమె మృతి వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని బంధువులు చెప్పారు. కుటుంబసభ్యులంతా ఢాకా వెళ్లాలనుకుంటున్నామని, ఇందుకు విదేశాంగ శాఖ లాంఛనాలు పూర్తి చేస్తున్నదని తరుషి జైన్ కజిన్ సోదరుడు శిరిష్‌ తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా