ఎయిర్ ఇండియా- రైల్వేస్ ప్రైస్ వార్

5 Jan, 2017 13:07 IST|Sakshi
ఎయిర్ ఇండియా- రైల్వేస్ ప్రైస్ వార్

న్యూఢిల్లీ:  విమాన టికెట్లలో డిస్కౌంట్ ఆఫర్లతో భారతీయ రైల్వేలకు  ప్రభుత్వ, ఇతర ప్రయివేట్  విమానయాన సంస్థలు  షాకిస్తున్నట్టే కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా  ప్రభుత్వరంగ విమాన యాన సంస్థ  ఎయిర్ ఇండియా  రాజధాని  ఎక్స్ప్రెస్ రైలు చార్జీలకు దాదాపు సమామైన ధరలను  ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే నూతన సంవత్సరంలో మూడు ప్రధాన విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించాయి.  తాజా ఎయిర్ ఇండియా  మూడు నెలల తగ్గింపు ధరలను లాంచ్ చేసింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆఫర్  జనవరి 6 న మొదలై ఏప్రిల్ 30 వ తేదీతో ముగియనుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రాయితీ టిక్కెట్లు జనవరి 26 ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి.

(చదవండి: ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు)

రైల్వే రిజర్వేషన్ కోసం వెయిటింగ్ తదితర కారణాల రీత్యా అసంతృప్తిగా ఉన్న రైల్వే  ప్రయాణికులను ఆకర్షించే యోచనలో  ఈ తగ్గింపు ధరల్ని ఎయిర్ ఇండియా  ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ ప్రత్యేక ఛార్జీలు అన్ని రాజధాని రూట్ తోపాటు,   జాతీయ రవాణా సంస్థ  రైల్వేస్  తిరగని ఇతర మార్గాల్లో కూడా అందుబాటులోకి తెచ్చినట్టు  నివేదికలు  వెల్లడిస్తున్నాయి.

ఉదాహరణకు, న్యూ ఢిల్లీ-ముంబై  విమాన ఛార్జీ రూ 2,401 కే అందిస్తుండగా  , రాజధాని  ఎసి సెకండ్ కాస్ల్  ఛార్జీ  రూ 2,870 గా ఉంది. న్యూఢిల్లీ-పాట్నా రాజధాని టికెట్  రూ 2,290, కాగా, ఎయిర్  ఇండియా ఎకానమీ క్లాస్  టికెట్ ను  రూ 2,315 కు అందిస్తోంది.


 

మరిన్ని వార్తలు