చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!

2 Oct, 2015 10:34 IST|Sakshi
చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!

చపాతీలు గుండ్రంగా రాకపోతే ఏం చేస్తారు.. ఏదైతేనేం, కడుపులోకి వెళ్లాక అంతా ఒకటే కదా అని తినేస్తాం. అంతేకదూ. కానీ, పాకిస్థాన్లో మాత్రం అలా కాదు. పదమూడేళ్ల వయసున్న తన కూతురు చపాతీలను సరిగా చేయలేదన్న కోపంతో.. ఆమెను చంపేశాడో కసాయి కన్నతండ్రి. ఇందుకు తన కొడుకు సాయం కూడా తీసుకున్నాడు.

ఈ ఘటన ఇస్లామాబాద్లోని అజీమ్ పార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అనీఖా అనే ఆ చిన్నారిని తామిద్దరం తీవ్రంగా కొట్టినట్లు తండ్రి, కొడుకు ఇద్దరూ అంగీకరించారు. దాంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆమె మరణించింది. దాంతో వాళ్లు ఆమె మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న పొలాల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు