పాక్ లో ఆ పెళ్లిళ్లకు ఓకే!

27 Jun, 2016 11:56 IST|Sakshi

ఇస్లామాబాద్: ట్రాన్స్ జండర్ల వివాహాలకు అనుమతినిస్తూ పాకిస్తాన్ లో 50 మంది మత పెద్దలు(క్లరిక్ లు) ఫత్వా జారీ చేశారు. దీంతో ట్రాన్స్ జండర్ ను వివాహాం చేసుకోవడం ఇక పాక్ లో చట్టబద్దం కానుంది. తన్ జీమ్-ఇత్తేహాద్-ఐ-ఉమ్తత్ కు చెందిన మత పెద్దలు మగ లేదా ఆడా ఏదో ఒక లక్షణం కలిగిన ట్రాన్స్ జండర్ ను వివాహం చేసుకోవచ్చని, ఆడ, మగ లక్షణాలను కలిగిన ట్రాన్స్ జండర్స్ వివాహం చేసుకోవడానికి కుదరని చెప్పారు.  

ట్రాన్స్ జండర్స్ ను దోచుకోవడం చట్ట విరుద్ధమని చెప్పారు. తల్లిదండ్రుల వదిలేసిన ట్రాన్స్ జండర్స్ ను దేవుని వద్దకు రావాలంటూ ఆహ్వానించారు. అలాంటి తల్లిదండ్రులను శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. ట్రాన్స్ జండర్స్ ను అవమానించే సాధారణ పౌరులను శిక్షించాలని, సాధారణ ముస్లిం పౌరులలానే వారికి అంత్యక్రియలు జరిగేలా ఆదేశించారు.

మరిన్ని వార్తలు