ఇసుక తవ్వకాల్లో కొట్లాట

7 Nov, 2013 02:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇసుక అక్రమ రవాణా వ్యవహారం మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లోని రెండు సరిహద్దు గ్రామాల మధ్య దాడులకు దారి తీసింది. కర్రలతో కొట్టకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు ఇసుక అక్రమ రవాణాదారులు రాయలసీమలోని కర్నూలు జిల్లా మునగలపాడు వైపు వచ్చి ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం ఇసుకను తోడుకునేందుకు మునగాలపాడు సమీపంలోని తుంగభద్ర నది వద్దకు చేరుకున్నారు.
 
 నదిలో తాగునీటి పథకానికి చెందిన పైప్‌లైన్లు ఉన్నాయని.. ఇటువైపు రావద్దని అక్కడున్న వాటర్‌మన్ మద్దిలేటి  వారించినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని  మద్దిలేటి కర్నూలు తహశీల్దారుకు ఫిర్యాదు చేశాడు. విష యం  తెలుసుకున్న పుల్లూరు వాసులు అతనిపై దాడిశారు. దీంతో ఇరుగ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని పరస్పరం దాడులకు దిగారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కర్నూలు పోలీసులు రావడంతో పుల్లూరు వాసులు పరారయ్యారు. మిగిలిన వారిలో కొంతమంది పోలీసులపై దాడికి యత్నించడంతో వారిపై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు