మహాభారతాన్ని నిర్మించబోతున్న దుబాయ్ బిలియనీర్

17 Apr, 2017 20:22 IST|Sakshi
మహాభారతాన్ని నిర్మించబోతున్న దుబాయ్ బిలియనీర్

కొచీ: ప్రతిష్టాత్మక వెయ్యికోట్ల భారీ  బడ్జెట్‌ తో  తెరకెక్కనున్న మహాభారత్​  చిత్రానికి నిర్మాత ఖరారయ్యాడు.  యూఏఈకి చెందిన  భారత వ్యాపారవేత్త బీఆర్‌ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారతదేశంలోనే అతిపెద్ద మోషన్‌ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ కీలక పాత్రపోషించనున్నారు. ప్రముఖ యాడ్‌ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్‌ మేనన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ ఎంటీ ప్రాజెక్ట్‌  ఈ  మూవీని రూపొందించనుంది.  

ఈ చిత్రంలో కీలకమైన భీముడి పాత్రలో  సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌  కనిపించనున్నారు. ఈ విషయాన్ని  తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా రిలీజ్‌ చేశారు.  ఈ  చిత్రంలో భీమ పాత్రకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని  మోహన్‌ లాల్‌ తెలిపారు. ఈ  సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు.  

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిల డ్రీమ్ సినిమా మహాభారత్  మూవీని,  ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్  అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్‌ 2018న మొదలుపెట్టి 2020కి రిలీజ్‌ చేయనున్నారు. అలాగే మొదటి భాగం విడుదలైన 90 రోజుల్లోనే రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారని సమాచారం.

అంతే కాకుండా ఈ సినిమా కోసం నటీనటులను టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎంపికచేయనుండగా, వారిని ఒక అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనుండడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ సినిమా లో గొప్ప పేర్లు  ఉత్తమ ప్రతిభగల,  సాంకేతిక సిబ్బంది,  ఇతర అకాడమీ అవార్డు విజేతలు సహా పాపులర్‌ నటులతో   రూపొందనున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళంతోపాటు ఇతర  విదేశీ భాషల్లోకి డబ్బింగ్  చేయనున్నామని  సంస్థ  ఒక ప్రకటనలో తెలిపింది.
 

మరిన్ని వార్తలు