కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?

6 Jan, 2017 14:48 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. 7వ వేతన సంఘం సిఫారసుల కింద  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని (డియర్‌నెస్ అలవెన్స్)మార్చినుంచి అమలు చేయవచ్చని  ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి శుక్రవారం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను  ప్రకటించ వచ్చని భావిస్తున్నారు.  

గత అక్టోబర్ లో వేతన సంఘం  కమిటీ ఉద్యోగుల డీఏ చెల్లింపు ఫైనల్ రిపోర్టు ను సమర్పించింది. 7వ వేతన సంఘం 196  సిఫారసుల్లో  51  లను రద్దు చేయగా 37 ని పునస్సమీక్షించింది.  కరవు భత్యం కంటే ఇతర భత్యాలు ఎక్కువగా ఉనాయని వీటిని సమీక్షించాలని  తెలిపింది. దీంతో  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన వెల్లువెత్తింది.  అయితే ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసౌప్  నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది.  నివేదిక సమర్పణకు గడువును ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2017కు పొడిగించింది.  
కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 వ వేతన సంఘం సిఫార్సులు కింద డీఏ ను పొందుతున్నారు.అయితే డీఏ ఏ మేరకు ఇస్తారనేది అనేది  ఇప్పటికీ అస్పష్టమే.

 

>
మరిన్ని వార్తలు