చార్జీలు చూశాకే ‘క్రెడిట్’ వాడాలి!

7 Nov, 2016 01:06 IST|Sakshi
చార్జీలు చూశాకే ‘క్రెడిట్’ వాడాలి!

ఫైనాన్సియల్ బేసిక్స్..
 క్రెడిట్ కార్డులిపుడు అత్యవసర ఆర్థిక సాధనంగా మారిపోయాయి. అందుకే వీటి డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఫర్వాలేదు. కానిపక్షంలో చాలా సమస్యలు ఎదుర్కోవాలి. కార్డుల వాడకం గురించి తెలుసుకోవటంతో పాటు వాటికి సంబంధించిన చార్జీలను కూడా చూడాలి. మనకు తెలియకుండానే కొన్ని చార్జీలు పడుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఆలస్యంగా చెల్లించే పేమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్డులపై మనం చెల్లించే చార్జీలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం...
 
 ఫ్రీ కార్డు: దాదాపుగా ఏ క్రెడిట్ కార్డు కూడా ఉచితంగా రాదు. తొలి ఏడాది కార్డుకు ఎలాంటి చార్జీలూ ఉండకపోవచ్చు. కానీ కార్డు జారీ సంస్థలు తర్వాత సంవత్సరానికి కొంత మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తాయి.
 
 ఆలస్య చెల్లింపులు: కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లిస్తే... ఆ ఆలస్యానికీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని మరువొద్దు.  
 
 ఏటీఎం విత్‌డ్రాయెల్స్: మనం క్రెడిట్ కార్డులను అటు ఔట్‌లెట్స్‌లోనూ, ఇటు ఏటీఎంలలోనూ స్వైప్ చేయవచ్చు. అయితే ఇక్కడ రెండింటికీ తేడా ఉంది. ఏటీఎంలో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకుంటే మాత్రం క్యాష్ అడ్వాన్‌‌స చార్జీలను చెల్లించాల్సి వస్తుంది.
 
 ఆలస్య చెల్లింపులు.. వడ్డీ: చాలా క్రెడిట్ కార్డు సంస్థలు ఆలస్య చెల్లింపులకు గానూ చెల్లించని మొత్తానికి 42 శాతం వరకు వడ్డీని గుంజుతున్నాయి. అలాగే ఈ వడ్డనపై మళ్లీ సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది.
 
  నాన్ పేమెంట్: క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ అమౌంట్ రుసుమును కూడా చెల్లించకపోతే దానికి కూడా చార్జీలు పడతారుు. ఇవి కార్డు ఔట్‌స్టాండింగ్ పేమెంట్స్‌పై ఆధారపడి ఉంటాయి.
 
 లిమిట్ దాటితే: పొరపాటున కొన్నిసార్లు కార్డుపై ఉన్న పరిమితిని దాటి లావాదేవీలు జరుపుతుంటారు. వీటికి వడ్డన భారీగానే ఉంటుంది.
 
 ఓవర్సీస్ ట్రాన్సాక్షన్: కొన్ని సంస్థలు విదేశాల్లో జరిపే లావాదేవీలకు చార్జీలను వసూలు చేస్తుంటారుు. ఈ చార్జీలు ఆ ట్రాన్సాక్షన్‌లో 3-3.5 శాతం వరకు ఉండొచ్చు.
 
 డూప్లికేట్ స్టేట్‌మెంట్: నెలవారీగా కార్డు స్టేట్‌మెంట్లను ఉచితంగా పొందొచ్చు. కానీ మనకు ఏమైనా అదనపు స్టేట్‌మెంట్ కావాలంటే మాత్రం అప్పుడు డూప్లికేట్ స్టేట్‌మెంట్ చార్జీలు చెల్లించాలి.
 
 కార్డు రిప్లేస్‌మెంట్: క్రెడిట్ కార్డు పోయిందనుకోండి..కొత్త కార్డు కోసం క్రెడిట్ సంస్థలు కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారుు. అందుకే ఈ ప్రపంచంలో ఏదీ కూడా ఉచితంగా రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.  

 

 

>
మరిన్ని వార్తలు