ఏప్రిల్‌ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి

23 Feb, 2017 20:02 IST|Sakshi
ఏప్రిల్‌ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి

న్యూఢిల్లీ:  స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి  అయిదు అసోసియేట్‌ బ్యాంకులు  మాతృ సంస్థ ఎస్‌బీఐలో పూర్తిగా విలీనం  కానున్నాయని ఎస్‌బీఐ  రెగ్యులేటరీ ఫైలింగ్‌ లోతెలిపింది. 2017 ఏప్రిల​ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ మారతాయని తెలిపింది.

గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత  డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్‌బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ  ముగిసిన తరువాత అసోసియేట్‌ బ్యాంకులు ఎస్‌బీబీజే, ఎస్‌బీఎం, ఎస్‌బీటీ షేర్లను స్టాక్‌మార్కెట్ల నుంచి తొలగించనున్నారు.

స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్  అసోసియేట్‌ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్  తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్‌  బోర్డ్‌ ఆఫ్‌ బ్యాంకు  ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్‌ రేషియో ఆధారంగా  ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే  భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్‌బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు