మరో మైలురాయిని అధిగమించిన ఫ్లిప్కార్ట్

21 Sep, 2016 18:06 IST|Sakshi
మరో మైలురాయిని అధిగమించిన ఫ్లిప్కార్ట్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో మైలురాయిని అధిగమించింది. వంద మిలియన్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ఫామ్పై నమోదుచేసుకున్నట్టు ఫ్లిప్కార్ట్ బుధవారం ప్రకటించింది. ఈ మైలురాయిని తాకిన మొదటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా ఫ్లిప్కార్ట్ నిలిచినట్టు ఈ కంపెనీ బుధవారం పేర్కొంది. 2016 మార్చిలో 75 మిలియన్ రిజిస్ట్రర్ యూజర్ల స్థాయిని తాకిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఈ ల్యాండ్మార్కును క్రాస్ చేసినట్టు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం 100 మిలియన్ల రిజిస్ట్రర్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ఫామ్ కలిగిఉన్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. 
 
భారత్లో వైర్లెస్, వైర్లైన్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లలో రిజిస్ట్రర్ కస్టమర్ బేస్ మొత్తం 63 శాతం ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడంలో తమ ప్లాట్ఫామ్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ కృషే మిలియన్ల భారతీయ యూజర్లను ఆన్లైన్ షాపింగ్ చేయడానికి దోహదం చేస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు బిని బన్సాల్ తెలిపారు. తమ ఫ్లాట్ఫామ్పైకి ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తోడ్పడుతున్నట్టు చెప్పారు.
 
>
మరిన్ని వార్తలు