పొగమంచుతో 90 విమానాలు రద్దు

6 Jan, 2014 11:13 IST|Sakshi
పొగమంచుతో 90 విమానాలు రద్దు

న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రభావం చూపింది. పొగ మంచు దట్టంగా అలముకోవడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి. సుమారు 150 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడవం, కొన్నింటిని దారి మళ్లించారు. మంచు కారణంగా వెలుతురు మందగించడంతో పలు విమానాలు రద్దు చేశారు. గత రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల మధ్యలో 90 విమానాలు రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

పొగమంచుతో రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రద్దయ్యాయి. ఉదయం సమయంలో రోడ్లపై వాహనాలు సంచారం చాలా తక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు