ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

19 Dec, 2013 09:15 IST|Sakshi
ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. కనెక్టింగ్‌ ఫ్లైట్‌, ట్రైన్ పట్టుకోలేకపోతున్నామని, దీంతో చాలా సమయం వృధా అయిపోతోందని ప్రయాణికులు అంటున్నారు.

 

అయితే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు.  పొగమంచు కారణంగా పగటిపూట కూడా లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లల్లోంచి బైటకు రావాలంటేనే భయమేస్తుందని స్థానికులు వెల్లడించారు. డిసెంబర్ మాసంలోనే చలి ఇంతగా ఉంటే, ఇక జనవరిలో ఎలా ఉంటుందోనని హస్తినవాసులు గజగజలాడుతున్నారు.

అలాగే పంజాబ్‌పై చలి పంజా విసిరింది. చలిగాలులతో అమృత్‌సర్‌వాసులు వణికిపోతున్నారు. మంటలు వేసుకుని ... గరం గరం ఛాయ్‌ తాగుతూ ... వెచ్చదనాన్ని పొందుతున్నారు. అయితే బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా విమానాలు విమానాశ్రయానికే పరిమితమైనాయి.

 

అలాగే రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన చలి ఉండడంతో బస్టాండ్స్‌, రైల్వే స్టేషన్స్‌లో చలికి గజగజలాడుతూ .. బస్సులు, రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు