‘నోట్లు రద్దు’కు నోబెల్‌ పురస్కారం!

30 Aug, 2017 20:17 IST|Sakshi
‘నోట్లు రద్దు’కు నోబెల్‌ పురస్కారం!

- ఆర్బీఐపై  చిదంబరం సెటైర్లు
- లాభం 16 వేల కోట్లైతే.. కొత్త నోట్ల ప్రింటింగ్‌కు 21 వేల కోట్లు


న్యూఢిల్లీ:
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి మాత్రమే నోట్ల రద్దు ప్రక్రియ పనికొచ్చిందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. అసలు నోట్ల రద్దును ప్రతిపాదించిన రిజర్వ్‌బ్యాంక్‌ ఆర్థికవేత్తలకు నోబెల్‌ పురస్కారం ప్రకటించాలని సెటైర్లు వేశారు.

రద్దయిన పెద్ద నోట్ల లెక్కల వివరాలను బుధవారం ఆర్బీఐ వెల్లడించిన కొద్దిసేపటికే చిదంబరం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘‘మొత్తం రూ.15.44 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దు చేశారు. తిరిగి బ్యాంకుల్లోకి చేరకుండా మిగిలింది కేవలం ఒక్క శాతం అంటే రూ.16వేల కోట్లు! నిజంగా ఆర్బీఐ సిగ్గుపడాల్సిన విషయం ఇది’’ అని వ్యాఖ్యానించారు.

కొత్త నోట్ల ముద్రణకు రూ.21వేల కోట్లు: ‘‘మొత్తం నోట్ల రద్దు ప్రక్రియ ద్వారా ఆర్బీఐకి లాభించింది(వెనక్కిరాని ఒక్క శాతం) 16 వేల కోట్లు. అదే కొత్త నోట్ల ప్రింటింగ్‌కు అయిన ఖర్చు రూ.21 వేల కోట్ల పైమాటే! వారెవా!! నిజంగా నోట్ల రద్దు ఐడియాను రికమండ్‌ చేసిన ఎకనమిస్టులకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిందే’’ అని సెటైర్‌ వేశారు

నోట్ల రద్దు లక్ష్యం ఇదేనా?: డీమానిటైజేషన్‌లో భాగంగా 99 శాతం కరెన్సీని చట్టబద్ధంగా మార్చేశారని, ముమ్మాటికి ఇది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి తప్ప మరొకటి కాదని చిదంబరం అన్నారు.

(చదవండి: రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది)

 

మరిన్ని వార్తలు