భారత రాయబారి వాహనంపై దాడిని ఖండించిన మహమ్మద్ నషీద్

29 Oct, 2013 10:06 IST|Sakshi

మాల్దీవుల రాజధాని మాలెలో భారత రాయబారి రాజీవ్ షహరి వాహనంపై నిన్న సాయంత్రం ఆగంతకులు రాళ్ల దాడిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన ఆగంతకుల చర్యను మతిలేని చేష్టలుగా వ్యాఖ్యానించారు.

 

మాలెలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఆగి ఉన్న రాజీవ్ షహరి వాహనంపైన మొటర్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్ల దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని, కానీ రాళ్ల దాడితో కిటికి అద్దాలు పగిలిపోయాయని, అలాగే కారు ధ్వంసమైందని  పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!