క్యాబిన్లో ఎలుక... గాలిలో విమానం

31 Jul, 2015 10:30 IST|Sakshi
క్యాబిన్లో ఎలుక... గాలిలో విమానం

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి యూరప్లోని మిలాన్ నగరానికి ఏయిర్ ఇండియా విమానం ఏఐ -123 గురువారం బయలుదేరింది. విమానం బయలుదేరి అప్పటికి నాలుగు గంటలు దాటింది. ఇంతలో విమాన క్యాబిన్లో ఎలుక సందడి చేస్తుంది. ఆ విషయాన్ని విమాన సిబ్బంది, ప్రయాణికులు గుర్తించారు. వెంటనే దింపేందుకు ప్రయత్నించారు.

తీరా చూస్తే సదరు విమానం పాకిస్థాన్లో ప్రవేశించింది. విమానంలో మొత్తం 200 మంది ప్రయాణికులు ఉన్నారు. క్యాబిన్ లోని ఎలుక ఓ వేళ వైర్లు కొరికితే... గాలిలో ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి. వారికి ఏం చేయాల్లో పాలుపోలేదు. తిరిగి న్యూఢిల్లీ వెళ్లితే.. అదే విషయాన్ని పాలం విమానాశ్రయ అధికారులకు తెలిపారు.

వారు ఉన్నతాధికారులను సంప్రదించి... వెనక్కి వచ్చేందుకు విమాన పైలెట్కు సమాచారం ఇచ్చారు. దాంతో విమానం మళ్లీ న్యూడిల్లీలో ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా హామయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. విమాన క్యాబిన్లో ఎలుక ఉందో లేదా ఇంకా నిర్థరాణ కాలేదు. ప్రయాణికుల క్షేమమే తమకు ముఖ్యం అందుకే విమానాన్ని వెనక్కి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై తమ ఇంజనీరింగ్ బృందం విచారణ జరుపుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు