ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై

14 May, 2014 14:04 IST|Sakshi
ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై

గుర్గావ్ ప్రాంతంలో ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. 5.1 కిలోమీటర్ల పొడవున ఆరు స్టేషన్లలో ఆగే ఈ రైళ్లలో బుధవారం నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఎంటీఎస్ బ్రాండ్నేమ్తో సేవలు అందించే సిస్టెమా శ్యామ్ టెలి సర్వీసెస్, ర్యాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్ లిమిటెడ్ కలిసి దీన్ని అందిస్తున్నాయి.

ర్యాపిడ్ మెట్రోలతో పాటు ఇంకా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్2, మైక్రోమాక్స్ మౌల్సరి ఎవెన్యూ స్టేషన్లలో కూడా వై-ఫైని ఉచితంగా అందించాలని ఎంటీఎస్ నిర్ణయించింది. అయితే.. ఈ ఉచిత సేవలు 6నెలల పాటు మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాతి నుంచి వీటికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎంటీఎస్ సీఈవో దిమిట్రీ షుకోవ్ తెలిపారు. ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 95 శాతానికి పైగా ప్రయాణికులు మెట్రోలో వెళ్లేటప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని, 15-35 మధ్య వయస్కులలో ఇది మరీ ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది.

>
మరిన్ని వార్తలు