శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎలా ఉంటుందో తెలుసా?

31 Oct, 2016 10:03 IST|Sakshi
శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎలా ఉంటుందో తెలుసా?
గెలాక్సీ నోట్7 సంక్షోభంతో ఇటు మార్కెట్లో తమ కీర్తిప్రతిష్టలను.. అటు కంపెనీ లాభాలను భారీగా కోల్పోయిన శాంసంగ్, తన అప్కమింగ్ డివైజ్పై నమ్మకాలను భారీగా ఆశలు పెంచేసుకుంది. ఎలాగైనా మళ్లీ మార్కెట్లో తమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం, గెలాక్సీ ఎస్8ను పలు జాగ్రత్తలతో రూపొందిస్తోంది. సరికొత్త డిజైన్, మెరుగైన కెమెరాలతో వినియోగదారుల ముందుకు తీసుకొస్తామని శాంసంగ్ చెప్పింది. ఈ ఫోన్కు సంబంధించిన డిజైన్ రూపరేఖలను కంపెనీ రివీల్ చేసింది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ హైఎండ్ స్మార్ట్ఫోన్ను స్లిక్ డిజైన్తో రూపొందిస్తున్నామని, కెమెరాను మెరుగుపరిచామని పేర్కొంది. మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సర్వీసుతో ఇది వినియోగదారులను అలరించనుందని వెల్లడించింది.
 
అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఒక్క ఫీచర్ను కూడా కంపెనీ రివీల్ చేయలేదు. అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్-ఇంటిలిజెన్స్ సాప్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేసిన శాంసంగ్, ఏఐ రంగంలో మార్కెట్లో తమ పరపతిని పెంచుకోవాలని ఆశిస్తోంది. ఆపిల్ మొబైల్ డివైజ్ల కోసం డిజిటల్ వాయిస్-అసిస్టెంట్ కింద సిరి యాప్ను ఈ వివ్ డెవలపర్లే అభివృద్ధి చేశారు. ఈ సంస్థను గత నెలలో శాంసంగ్ కొనుగోలు చేసేసింది. ప్రాథమిక లీకేజీల ప్రకారం మార్కెట్లోకి రాబోతున్న అప్కమింగ్ శాంసంగ్ ఫీచర్లు.. 5.5 అంగుళాల 4కే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరా సెట్అప్(16 ఎంపీ, 8ఎంపీ కెమెరాలు)గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే అప్టికల్ ఫింగర్ప్రింట్ టెక్నాలజీతో రాబోతున్న కంపెనీ మొదటి స్మార్ట్ఫోన్ ఇదేనట. అయితే పలు రిపోర్టుల ప్రకారం గెలాక్సీ ఎస్7లో నెలకొన్న సమస్యను కనుగొనడానికి కంపెనీ తలమునకలై ఉన్న నేపథ్యంలో గెలాక్సీ ఎస్8 రూపకల్పన ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు