ఆ మంత్రి పోలీసుల ఎదుట లొంగిపోవాలి

7 Mar, 2017 10:49 IST|Sakshi
ఆ మంత్రి పోలీసుల ఎదుట లొంగిపోవాలి

లక్నో: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంపై వస్తున్న విమర్శలకు అధికార సమాజ్‌వాదీ పార్టీ స్పందించింది. ప్రజాపతి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి, పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఎస్పీ నేత అబు అజ్మీ సూచించారు. ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు.

గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనిపై స్టే విధించాలని ప్రజాపతి కోరాగా సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలో కొనసాగించడంపై యూపీ గవర్నర్ తప్పుపట్టారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున పోటీచేశారు.

>
మరిన్ని వార్తలు