జోధ్పూర్లో విద్యార్థినిపై యాసిడ్ దాడి

24 Feb, 2015 21:54 IST|Sakshi

జైపూర్: జోధ్పూర్లో విద్యార్థిపై యాసిడ్ దాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్రంగా ఖండించారు.  దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వసుంధర రాజె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిందని గెహ్లట్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆమెకు వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం జోధ్పూర్లోని మౌలానా ఆజాద్ టీచర్స్ ట్రైనింగ్ కళాశాల నుంచి వస్తున్న విద్యార్థినిపై బైక్పై వచ్చి ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేసి అక్కడ నుంచి పరారైయ్యారు. యాసిడ్ దాడిలో సదరు విద్యార్థి మెడతో పాటు ఆమె శరీర వెనక భాగం తీవ్రంగా కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు